కోర్ట్ రూమ్ డ్రామా.. తుమ్ కో మేరీ కసమ్
బాలీవుడ్ నటుడు విక్రమ్ భట్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘తుమ్ కో మేరీ కసమ్’. ఎప్పుడూ హారర్ చిత్రాలతో మెప్పించే విక్రమ్‌భట్ ఈసారి ఆసక్తికరమైన కోర్ట్ రూమ్ డ్రామాతో వస్తున్నాడు. డాక్టర్ అజయ్ ముర్దియా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన సినిమా ఇది. ఇందులో అనుపమ్‌ఖేర్ ప్రధాన పాత్రలో నటించగా.. అదాశర్మ, ఇషా డియోల్, ఇష్వాక్ సింగ్, మెహర్జన్ మజ్దా, సుశాంత్‌సింగ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమా తాజాగా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో అనుపమ్ ఖేర్ పాత్రను హైలైట్ చేస్తూ సాగింది. మరోవైపు తన భర్త కలలను నెరవేర్చడంలో బిజీగా ఉండే ఇల్లాలిగా అదాశర్మ పాత్రను పరిచయం చేశారు. ఈషా డియోల్ లాయర్ పాత్రలో కనిపించనుంది. మొత్తంగా ఈ సినిమా కథ ఐవీఎఫ్ సెంటర్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది.






