8 May, 2026 | 12:09 PM

మల్లారెడ్డి కాలేజీలో గీతావిష్కరణ

05-03-2025 12:00 AM

శ్రీహర్ష, కశికా కపూర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఎల్‌వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్’. ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ ఇందులో కథానాయకుడి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. పవన్ కేతరాజు దర్శకత్వంలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.  ఈ చిత్రంలో కుటుంబ సంబంధాలు, ప్రేమ భావోద్వేగాలను అందంగా చూపించనున్నారు. మార్చి చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ‘హే మధుమతి’ పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ మెయిన్ క్యాంపస్‌లో చామకూర షాలిని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా స్టూడెంట్ శ్రీహర్ష నటించిన సినిమా ఇది. ఆయనకు ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో శ్రీహర్ష మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చిన సంగీతం అద్భుతంగా ఉంది’ అని చెప్పారు. ‘కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రమిది’ అని దర్శకుడు పవన్ కేతరాజు తెలిపారు. భద్రం, షకలక శంకర్, నవాబ్ షా, రఘుబాబు, ప్రవీణ్, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ శాంతికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి డీవోపీ: శ్యామ్ కే నాయుడు; నిర్మాతలు: కిషోర్ రాఠీ, ఏ సామ్రాజ్యం.