11 May, 2026 | 9:10 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన సీపీ సాయిచైతన్య

09-09-2025 12:00 AM

నిజామాబాద్ సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.    ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు.

ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ , వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల , పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని  పోలీస్ కమిషనర్ శ సాయి చైతన్య తెలిపారు.   ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజావాణి  కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తున్నామని సిపి తెలిపారు.