09-09-2025 12:00:00 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
సిద్దిపేట, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి):పార్టీ కోసం కష్టపడి పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సిద్దిపేట జిల్లా పార్టీ నాయకులకు పి లుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిని ఆయన నివాసంలో కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే జరుగుతుందని కేంద్రం ఇచ్చే నిధుల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలన్నారు.
త్వరలోనే జిల్లాలో పర్యటిస్తానని వెల్లడించారు. పార్టీ నాయకులు గుండ్ల జనార్ధన్, నలగామ శ్రీనివాస్, గాడిపల్లి భాస్కర్, సింగం సత్త య్య, నత్తి మల్లేష్, దేవులపల్లి మనోహర్, సురేష్, పంజా అశోక్ , లక్ష్మణ్ గౌడ్, తిరుపతి రెడ్డి, పెంటయ్య, పోచయ్య, చిక్కుడు చంద్రం, నాయిని సందీప్, నరసింహులు, బాసంగారి వెంకట్, సంతోష్, సురేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.