calender_icon.png 11 September, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గంధం చెరలో కస్తూర్బా విద్యాలయం

09-09-2025 12:00:00 AM

  1. దుర్వాసనల మధ్య చదువులు

అనారోగ్యానికి గురవుతున్న విద్యార్థులు 

వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు

జహీరాబాద్, సెప్టెంబరు 8 :జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం మండలం లో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాల య పరిస్థితి అధ్వానంగా ఉంది. గేటు లోపలికి అడుగుపెట్టగానే విపరీతమైన దుర్గంధం వెలువడుతుంది. డ్రైనేజీ లీక్ కావడంతో నీ రు బయటకు పోయే పరిస్థితి లేకపోవడంతో ప్రతిరోజు విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.

పాఠశాల నిర్మాణం చేసే సమ యంలో లోపలి నీరు బయటికి వెళ్లేందుకు మార్గం చేయకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. పాఠశాలలో దాదాపు 300 మం ది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ మంచి మార్కులతో ప్రతి సంవత్సరం ఉత్తీర్ణులవుతున్నారు. అయినప్పటికీ పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు మాత్రం పాఠశాలలో తీసుకోవల్సిన పరిశుభ్రతను పాటించడం లేదు.

విద్యార్థుల ముక్కుపుటాలు అదిరిపోయే విధం గా దుర్గంధంలోనే ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదం డ్రులు ప్రధానోపాధ్యాయురాలితో ఎన్నిసా ర్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో దుర్గంధం భారిన పడి బాలికలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న డిప్యూటీ తహసిల్దా ర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న దుర్గంధం చూ సి అవాక్కయ్యారు. 

విద్యార్థినీలకు వైద్య పరీక్షలు...

పాఠశాలలో రోగాల బారిన పడిన విద్యార్థులను చికిత్స నిర్వహించేందుకు సోమవా రం జరాసంగం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లను, సిబ్బందిని పిలిచి ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించారు. భరించలేనంత దుర్గం ధం పాఠశాల ఆవరణలో ఉండడంతో ఈగ లు, దోమలు అధికమై విద్యార్థులకు రోగాలు వస్తున్నా ప్రిన్సిపాల్ మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరించడం శోచనీయం.

ప్రతిరోజు ఇద్దరు వైద్యులను అక్కడికి పంపించి వైద్య సహాయం అందించాలని తహసీల్దార్ ఆదేశించినట్లు తెలిసింది. బియ్యం ముక్కిపోయి పురుగులు పట్టి ఉన్నాయని, వాటిని వెంటనే గోదాంకు పంపించి కొత్త బియ్యాన్ని తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ వెంటనే తెప్పిస్తానని హామీ ఇచ్చినట్ల డిప్యూటీ తహసిల్దార్ కరుణాకర్ రావు తెలిపారు. పాఠశాలను, హాస్టలను మండల స్థాయి విద్యాధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించకపోవడం వల్లే విద్యార్థులకు కష్టాలు వస్తున్నాయని ఆరోపించారు.