2 June, 2026 | 2:40 AM

కీసర పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ సుమతి

02-06-2026 12:12 AM

మేడ్చల్, జూన్ 1(విజయ క్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్ ను సీపీ సుమతి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత,  రికార్డులు, వివిధ విభాగాల నిర్వహణ, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం క్రైమ్  విభాగం సిబ్బందితో, రిసెప్షన్  ఇతర విభాగల సిబ్బందితో మాట్లాడి వారి విధులపై అవగాహనను పరిశీలించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.  విభాగాల ఇన్చార్జిలు, స్టేషన్ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై విధుల నిర్వహణలో మరింత చురుకుదనం ప్రదర్శించాలని సూచించారు. అలాగే సాంకేతిక యాప్ల వినియోగం, ఎన్ పి డి ఎస్ కేసుల దర్యాప్తు, మీ సురక్ష అప్లికేషన్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.

ప్రజలకు సురక్షితమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీసర ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, యస్ ఐ లు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.