31-07-2025 01:08:37 AM
మొత్తం 44 సబ్జెక్టులకు పరీక్షలు
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఆగస్టు 4 నుంచి 11 వరకు జరిగే సీపీగెట్ (కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 44 సబ్జెక్టులకు గానూ ఈ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నేటి నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.