శాసన సభలో సీపీఐ వాయిదా తీర్మానం
17-12-2024 10:38 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీపీఐ వాయిదా తీర్మానంపై చర్చలు సాగుతున్నాయి. కౌలు రైతులకు రైతుబందు పథకం అమలు చేయాలని, పంట రుణాలు మంజురు చేసి శాశ్వత పట్టాలు ఇవ్వాలని, సీతారామ చంద్రస్వామి భూముల్లో సాగుపై వాయిదా తీర్మానం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే సభ నిర్వహించి 16వ తేదీకి వాయిదా వేశారు. వారం రోజుల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమైంది. రెండో రోజు మొదలైన సమావేశం.. బీఆర్ఎస్ నిరసనలు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శలతో అర్థంతరంగా ముగిసింది.






