19 April, 2026 | 12:05 AM

నల్ల చొక్కాలు, బేడీలతో అసెంబ్లీకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

17-12-2024 11:02 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సేలు నిరసన తెలిపారు. అసెంబ్లీకి నల్ల చొక్కాలు, టీషర్టుల్లో బేడీలు వేసుకుని బీఆఎస్ ఎమ్మెల్సేలు వచ్చారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. నిన్న శాసనసభ లగచర్ల ఘటనపై అట్టుడికింది. రాష్ట్రంలోని పర్యాటక విధాన అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లగచర్ల అనే పేరును ప్రస్తావించగానే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ రైతుల నిర్భంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఇవాళ లగచర్ల రైతులపై అక్రమ కేసుల పెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా  నిరసనలు తెలపాలని బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రేపు అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.