22 July, 2026 | 10:46 AM

సీజెపి కార్యకర్తలపై లాఠీచార్జిని ఖండించిన సీపీఐ

22-07-2026 10:14 AM

వనపర్తి మండలం: ఢిల్లీలో "చలో పార్లమెంట్" కార్యక్రమంలో పాల్గొన్న సీజెపి కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థ సంస్కరణలు, పరీక్షల పేపర్ లీకేజీల నివారణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం దుర్మార్గమని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ,