calender_icon.png 9 January, 2026 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు బలహీన వర్గాల పార్టీ సీపీఐ

07-01-2026 12:42:36 AM

సీపీఐ శత సంబరాల సభకు తరలి రండి

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి 

కారేపల్లి జనవరి 6 (విజయక్రాంతి): భారత గడ్డపై శతవసంతాలు పూర్తి చేసుకున్న బడుగు బలహీన వర్గాల ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి అన్నారు. శతవసంతాల ముగింపు బహిరంగ సభ జనవరి 18వ తారీఖున ఖమ్మం లో జరుగుతున్న నేపథ్యంలో బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా జాతీయ బృందం చీమలపాడు, గాదెపాడు మీదగా కారేపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ జాత ని ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ 1925 కాన్పూర్లో ఆవిర్భవి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు.

పేదలు బడుగు బలహీన వర్గాలు అండగా నిలుస్తూ విద్యార్థి యువజన కార్మిక రైతు ప్రజా కళాకారుల సంఘాలను నిర్మించి ప్రజలను చైతన్యపరిచి, లక్షలాది ఎకరాలు పేదలకు పంచి పోరాటాలకు అంకురార్పణ చేసి ,సంపద ప్రజలందరికీ సమానంగా పంచబడాలన్నదే సిపిఐ లక్ష్యమని సమ సమాజ స్థాపనకు ఎటువంటి త్యాగాలకైనా వెనకడుగు వేయని పార్టీ సిపిఐ అని అన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మం నగరంలో జరిగే శతవసంతాల ముగింపు బహిరంగ సభకు 40 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు 29 రాష్ట్రాల నుండి పార్టీ కార్యకర్తలు ఈ బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు .కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులు భారీగా తరలివచ్చి ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు.

ఈ జాతకు జమ్ముల జితేందర్ రెడ్డి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు  నరసింహారావు సీతామహాలక్ష్మి నాయకత్వం వహించగా ప్రజానాట్యమండలి బృందం ఆటపాటలతో ప్రజలను చైతన్య పరుస్తూ యాత్ర కారేపల్లి మండలంలో కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎర్రబాబు, లతా దేవి ,జిల్లా కార్యవర్గ సభ్యులు రావి శివరామకృష్ణ ,మండల కార్యదర్శి పాపినేని సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు ఉంగరాల సుధాకర్, పుచ్చకాయల వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు పుచ్చకాయల శ్రీనివాసరావు, మండల కార్యవర్గ సభ్యులు రాయల రామారావు, వీరు నాయక్ ,వెంకట్ రెడ్డి, సయ్యద్ జానీ ,పోతనబోయిన రవి, అమిర్, జానీ, పార్టీ అనంతరామయ్య,  దుద్దుకూరు వెంకటేశ్వరరావు, బొమ్మగాని మహేష్ ,బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.