calender_icon.png 10 January, 2026 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రస్ట్ సేవలు అభినందనీయం

07-01-2026 12:43:42 AM

రాజన్న సిరిసిల్ల, జనవరి 6 (విజయ క్రాంతి): జిల్లాలో వేములవాడ పట్టణానికి చెందిన మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవలను గుర్తించిన వి.ఎన్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు తెలంగాణ మహారాష్ట్ర అధినేత వి. నరేందర్ రెడ్డి, ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మధు మహేష్ ను మంగళవారం కరీంనగర్, కొత్తపల్లి ఈ-టెక్నో స్కూల్లో శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాజిక స్పృహతో దాతల సహకారంతో ప్రారంభించిన అన్నదాన సేవలు నేటి వరకు నిర్విఘ్నంగా కొనసాగడం ప్రశంసనీయమని అపత్తులో అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం, పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవడం అభినందనీయ మని పేర్కొన్నారు. ఇలాంటి సేవా భావన మరింత విస్తరించాలని, భవిష్యత్తు లోనూ ట్రస్ట్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.అనంతరం డాక్టర్ మధు మహేష్ మాట్లాడుతూ, తమ సేవలకు గుర్తింపు లభించడం సంతోషకరమని తెలిపారు.

దాతల సహకారం స్వచ్ఛంద సేవకుల అంకిత భావంతోనే ట్రస్టు కార్యక్రమాలు విజయ వంతంగా కొనసాగుతున్నా యని చెప్పారు. భవిష్యత్తు లోనూ అన్నదానంతో పాటు అవసరమైనవారికి సహాయం అందిస్తూ, సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్.ఆర్. ఫౌండేషన్ సభ్యులు, మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు పీ.వీ.మాధవరాజు పాల్గొన్నారు.