calender_icon.png 9 January, 2026 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయాలను అనుసరించాలి

07-01-2026 12:42:20 AM

సుల్తానాబాద్, జనవరి 6 (విజయ క్రాంతి): భారతదేశంలో పురాతన కాలం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ ఆదరించాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత  నరేందర్ రెడ్డి అన్నారు. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ ఐక్యతకు చిహ్నంగా మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి పండుగకు ప్రత్యేక విశిష్టత ఉందన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండి రైతుల ఇండ్లలో సంతోషం వెల్లివిరియాల అని ఆకాంక్షించారు కనుమరుగవుతున్న పండుగలను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ప్రతి పండగల యొక్క విశిష్టతను తెలియజేస్తూ పూర్వ వైభవాన్ని తెస్తున్నామన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, తుపాకి రాముని మాటలతో  పాటు, ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిమంటలు, గాలిపటాలు, పిండివంటలు,  పల్లెటూరి వాతావరణం ఎంతో ఆకర్షణగా నిలిచింది. భోగిమంటల చుట్టూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కుల మతాలకు అతీతంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలను అద్భుతంగా తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు  ఉన్నారు.