03-12-2025 01:02:02 AM
మణుగూరు, డిసెంబర్ 2 (విజయక్రాంతి) :కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మండల సీపీఎం, సేవాలాల్ సేన నాయకులను, పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేశారు.
సీపీఎం సీనియర్ నాయకులునెల్లూ రి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు, నైనారపు నాగేశ్వర రావు, సేవాలాల్ సేన మండల అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్, మహిళా ఉపాధ్యక్షులు కవితలను ఎస్‌ఐ నగేష్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
అక్రమ అరెస్ట్లు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం..
ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులను అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను నిర్వీర్యం చేసేలా అక్ర మ అరెస్ట్ చేయడం సరికాదన్నారు.
సమస్యలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నిం చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొం తు నొక్కుతోందని విమర్శించారు. ప్రభు త్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అక్రమ అరెస్ట్ లను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలన్నారు.
గిరిజనుల వ్యతిరేకి రేవంత్
గిరిజనుల వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి అని సేవాలాల్ సేన మండల అధ్యక్షులు గుగులోత్ రవినాయక్ అన్నారు. గిరిజనుల అభివృద్ధిని పట్టించుకోని సీఎం జిల్లాకు రా వొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి లంబాడా సామాజిక వర్గ ఓట్లు కార ణమన్నారు.
అగ్రకులాలకు మాత్రమే అన్ని అవకాశాలు కల్పిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీ సామాజిక వర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ఎన్ని అరెస్టులను చేసినా బంజారా జాతి అభివృద్ధి కొరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయనను పోలీస్ లు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.