calender_icon.png 1 October, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి

01-10-2025 12:00:27 AM

జిల్లా కార్య వర్గసభ్యులు బూర్గు కృష్ణారెడ్డి 

చౌటుప్పల్, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): చౌటుప్పల మండల కమిటీ సమావేశం కందాల రంగారెడ్డి స్మారక భవనం నందు రాగిరి కిష్టయ్య  అధ్యక్షతన ముఖ్యఅతిథిగా కృష్ణా రెడ్డి  హాజరై మాట్లాడుతూ మండలంలో నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను పార్టీ మండల నాయకత్వం శాఖా కార్యదర్శులు పార్టీ సభ్యులు ప్రజలు అత్యధిక స్థానాలను గెలిపించాలని మండల ప్రజలను కోరారు. 

గత 100 సంవత్సరాలు కలిగిన ఎర్ర జెండా చరిత్ర ఎర్రజెండా నాయకత్వాన అనేక  ప్రజా పోరాటాలను నిర్వహించి ఐదు సంవత్సరాలు ఎంపీపీగా 25 సంవత్సరాలు  సింగిల్ విండో చైర్మన్ గా నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ కు ఉన్నదని అమరజీవి కందాల రంగారెడ్డి నాయకత్వం నా చౌటుప్పల్ మండలంలో పార్టీని బలోపేతం చేసిన కందాల రంగారెడ్డి స్ఫూర్తితో పార్టీని  ముం దుకు తీసుకుపోవాలని సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కృష్ణారెడ్డి  అన్నారు.

సమావేశంలో సిపిఎం  మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చేరిక సంజీవ రెడ్డి, తడక మోహన్, చింతల సుదర్శన్, బోయ యాదయ్య ,మండల కమిటీ సభ్యులు అంతటి అశోక్, ఆదిమూలం నందీశ్వర్ ,పల్లె మధు కృష్ణ పొట్ట ,శ్రీనివాస్ బోదాస్ వెంకటేష్, జక్కిడి దేవేందర్ రెడ్డి కొండే శ్రీశైలం, ఎల్లమల్ల సంజీవ మీసాల శీను, కొంతం సుశీల ,చెరుకు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.