01-10-2025 12:01:43 AM
సూర్యాపేట, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ నరసింహ ఆయుధాలకు, పోలీస్ వాహనాలకు పూజలు చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దసరా పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.
తదుపరి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి దసరా పండుగ, నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, డిసిఆర్బి డిఎస్పీ రవి, ఏఆర్ డిఎస్పీ నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, ఆర్‌ఐలు అశోక్, సురేష్, సాయిరాం, రాజశేఖర్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నల్గొండ క్రైమ్..
నల్గొండ క్రైమ్, సెప్టెంబర్ 30: జిల్లాపోలీసకార్యాలయంలోమంగళవారం విజయదశమి పండుగ సందర్భంగా ఆయుధ, వాహన పూజలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నిర్వహించారు శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్, యస్బి సిఐ రాము, 2టౌన్ సీఐ రాఘవరావు,్ర టాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్‌ఐలు సంతోష్, సూరపు నాయుడు, శ్రీను, హరిబాబు, ఆర్‌ఎస్‌ఐలు కల్యాణ్ రాజ్,రాజీవ్,అఖిల్,సాయి రామ్, సంతోష్, శ్రావణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.