01-10-2025 12:00:00 AM
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : సీజనల్ కేసులు నమోదు రహిత రాష్ర్టంగా తెలంగాణను తీర్చిదిద్దాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రా జీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం లో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. రాష్ర్టంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను పరిశీలించారు.
సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని మంత్రికి ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్షలో డైరెక్టర్ అఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్ వెల్లడించారు. రాష్ర్టంలో అన్ని ఆసుపత్రులలో సీజనల్ రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
సమావేశంలో వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, డీఎంఈ డా. నరేంద్ర కుమార్, డైరెక్టర్ అఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్, టీవీవీపీ కమిషనర్ డా. అజయ్ కుమార్,స్పెషల్ ఆఫీసర్ విమలా థామస్ పాల్గొన్నారు.