01-10-2025 12:31:06 AM
సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మానిక్
కొండాపూర్, సెప్టెంబర్ 30 :స్థానిక సమస్యల ఎన్నికలలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని సంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్ తెలిపారు. నిరంతరం ప్రజా పోరాటాలలో ముందుండి ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ప్రజల పక్షాన నిలబడుతున్నది సీపీఎం పార్టీ మాత్రమేనన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు భారీ ఎత్తున ఎర్ర జెండాను ఆదరించి సహకరించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మండల కమిటీ సభ్యులు బాబురావు, అప్పారావు, శాఖ కార్యదర్శిలు ఆంజనేయులు, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.