01-10-2025 12:29:54 AM
కొండాపూర్, సెప్టెంబర్ 30 : కొండాపూర్ మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరిగిరి కృష్ణమూర్తి, కొత్తగడి అమర్నాథ్ మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ కొండాపూర్ మండలంలోని జెడ్పిటిసి, ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా అందిస్తామన్నారు. ప్రభుత్వం రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముఖిం, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మ్యాకం విఠల్, జడ్పిటిసి సభ్యులు పద్మావతి పాండురంగం, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఎండి రుక్ముద్దీన్, మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రాందాస్, శ్యామ్ రావు, మాజీ సర్పంచులు ప్రకాశం, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, జైరాం, ప్రభు దాస్,ప్రేమనందం, శేఖర్,నాయకులు రవీందర్ నరేందర్, లింగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.