16 May, 2026 | 1:42 PM

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి.. సీపీఐ రాస్తారోకో

16-05-2026 01:11 PM

హనుమకొండ డబ్బాలు జంక్షన్ లో సిపిఐ రాస్తారోకో

హనుమకొండ,(విజయక్రాంతి): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను(Petrol and diesel prices hike) పెంచి పేద ప్రజలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థిక భారం మోపిందని, కేంద్ర సర్కార్ వైఫల్యంతోనే దేశంలో ధరల పెరుగుదల అని సీపీఐ హనుమకొండ(Hanumakonda Junction) జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం హనుమకొండ నగరంలోని డబ్బాలు జంక్షన్ వద్ద సీపీఐ హనుమకొండ మండల సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా తోట బిక్షపతి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రోజురోజుకు ధరలను పెంచి పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని కేంద్ర మంత్రులు ప్రకటించారని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలెండర్ల ధరలను రూ. 993 పెంచడంతో రూ.3100కు చేరుకున్నదని, గృహ అవసరాల గ్యాస్ సిలెండర్ పై రూ.50 పెంచడం, అలాగే పెట్రోల్, డీజీల్ మీద లీటరు రూ. 3, పెంచడం జరిగిందని, దీంతో ప్రజల మీద మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలెండర్ ధరల వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్భణం పెరిగి ప్రజలపై ఆర్థిక భారాలు పడతాయన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం వలన భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదని, చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నట్లని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ మండల కార్యదర్శి ఎన్.ఎ స్టాలిన్, మండల సహాయ కార్యదర్శి గుంటీ రాజేందర్, నాయకులు పొనుగోటి రాము, గోపాల్, చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, కోడపాక బాబు, మామునూరి దామోదర్, గుడికందుల శివ, పూజారి నరేందర్, కేతపాక ప్రసాద్, మాలోత్ మంగ, నలువాల సంధ్య, తాటికంటి మమత, గుంటీ రజిత తదితరులతో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.