16 May, 2026 | 1:42 PM

వచ్చే నెల 15 నుంచి తెలంగాణలో SIR ప్రక్రియ

16-05-2026 01:08 PM
  1. జులై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తాం
  2. అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తాం
  3. తెలంగాణలో 2022లో ఎస్ఐఆర్ ప్రక్రియ
  4. 25 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ
  5. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ బీఎల్ఓలు
  6. ప్రతి ఓటర్ కు రెండు ఎన్యుమరేషన్ ఫామ్ లు

హైదరాబాద్: వచ్చే నెల 15 నుంచి తెలంగాణ రాష్ట్రంలో SIR(Special Intensive Revision) ప్రక్రియ మొదలవుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి(State Chief Electoral Officer Sudarshan Reddy) శనివారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికీ వెరిఫికేషన్ జరుగుతోందని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. బీఎల్ వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫామ్ లు ఇస్తారని ఆయన సూచించారు.

ప్రతి ఓటర్(voter) కు రెండు ఎన్యుమరేషన్ ఫామ్ లు ఇస్తారు.. ఒకటి పూర్తి చేసి మళ్లీ తమకు ఇవ్వాలని తెలిపారు. ఇంకో ఎన్యుమరేషన్ ఫామ్ ను ఓటరు దగ్గరే అక్ నాలెడ్జ్ ఫామ్ గా ఉంటుందన్నారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫామ్(Enumeration Forms) లు సేకరించి.. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. జులై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఓటరు జాబితా డ్రాఫ్ట్ ను రాజకీయ పార్టీలకు ఇస్తాం, వెబ్ సైట్ లోనూ పెడతామన్నారు.

 25 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ

డ్రాఫ్ట్ నోటిఫికేషన్(Draft Notification) పై జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని తెలిపారు. అభ్యంతరాలు పరిశీలించాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిందని సుదర్శన్ రెడ్డి(Sudarshan Reddy) పేర్కొన్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగబోతుందన్నారు. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశం అన్నారు. 

ఆన్ లైన్ లోనూ ఎన్యుమరేషన్ 

ఆన్ లైన్ లోనూ ఎన్యుమరేషన్(Enumeration Now Available Online) చేసుకునే అవకాశముందని సీఈవో సదర్శన్ రెడ్డి వెల్లడించారు. Voters.eci.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లోనూ ఎన్యుమరేషన్ చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివరించారు. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫాములు సేకరించి.. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇస్తామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.