20 July, 2026 | 9:53 PM

కల్తీపై ఉక్కు పాదం..హైదరాబాద్ సిటీ

20-07-2026 02:34 AM

పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్

సికింద్రాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఆహార సంస్థల భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై హెచ్ పాస్ట్ ప్రత్యేక నిఘా ద్వారా దాడులు చేసి కల్తీల పై అధికారులు ఉక్కు పాదం మోపారు.కమిషనర్ టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్ పాస్ట్), ఆహార కల్తీని అరికట్టడానికి, ఆహార భద్రతా నిబంధనలను అమలు చేయడానికి, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి 17.07.2026 న హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా ముమ్మర దాడులు నిర్వహించారు.

ఈ ప్రత్యేక తనిఖీలను జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివిధ ఆహార వ్యాపార సంస్థలపై చేపట్టారు.ఈ ఆపరేషన్లలో భాగంగా 06 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ యాక్ట్, 2006 (ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం) మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.