20 July, 2026 | 9:55 PM

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు..

20-07-2026 02:36 AM
  1. ప్రమాదాలకు ఆహ్వానం
  2. విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం.. ప్రాణాలతో చెలగాటం

జవహర్‌నగర్, జూలై 19 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్లో 100 అడుగుల ప్రధాన రహదారి విస్తరణ పనులు జరుగుతున్నా, రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మిస్తున్నా, ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలపై అధికారులు దృష్టి సారించకపోవడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం రోడ్డు మధ్యలో నిలిచిన విద్యుత్ స్తంభాల కారణంగా వాహనదారులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్తంభాలను తప్పించుకునే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని చెబుతున్నారు.