అటల్ సేతు వంతెనకు పగుళ్లు
మహారాష్ట్ర: ముంబైలో గత ఐదు నెలల క్రిత్తం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అటల్ సేతు వంతెనకు పగుళ్లు కనిపించాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అటల్ సేతును పరిశీలించేందుకు శుక్రవారం సెవ్రి నుంచి న్హవా షేవా వరకు వెళ్లారు. ఆయనకు వంతెనపై చాలా దూరం వరకు పగుళ్లు కనిపించడంతో కారు దిగి చూశారు. ఈ సందర్భంగా నానా పటోలే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, చిన్నపాటి వర్షానికే వంతెనపై పగుళ్లు వచ్చాయని ఆరోపించారు.
ఈ పగుళ్లతో వంతెనపై ప్రయాణించే ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని, పగుళ్లకు సంబంధించిన చిత్రాలను వీడియో తీసి తన ఎక్స్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అటల్ సేతు దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన. ఈ వంతెన రాయ్ ఘర్ జిల్లాలోని ముంబైలోని ద్వీప నగరమైన సెవ్రిని కలుపుకోని 21.8 కి.మీ పొడవు, 6 లైన్ లతో ఉంటుంది. దాదాపు రూ.18 వేల కోట్లతో నిర్మించారు. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ఈ వంతెనను ప్రారంభించారు.






