5 August, 2026 | 1:55 AM

పుట్టిన గంటలోనే తల్లిపాలు పట్టించాలి

05-08-2026 12:40 AM

అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి

కొండాపూర్ ఆసుపత్రిలో ఘనంగా ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు’

తల్లిపాల విశిష్టతపై బాలింతలు, గర్భిణులకు అవగాహన

రంగారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1-7) సందర్భంగా కొండాపూర్ ఏరియా ఆసు పత్రిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘ నంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్ మయి అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు. ప్రతి శిశువుకు పుట్టిన గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత అవసరమని, అవి బిడ్డకు సంపూర్ణ పోషకాహారాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.

మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత నుండి 2 ఏళ్ల వరకు పౌష్టి కాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్య తపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా శిశు మరణాలను తగ్గించవచ్చ ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ స్వర్ణ కుమారి తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరికీ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఇతర అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో  డిసిహెచ్‌ఎస్ డాక్టర్ అనూరాగిణి రెడ్డి, మహిళా సంక్షేమ అధికారి శాంత శ్రీ, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షీబా హయత్, సీడీపీవో కవిత, మాస్ మీడియా అధికారి మంజుల, ఆర్ ఎమ్ ఓ  డాక్టర్ విజయలక్ష్మితో పాటు స్థానిక వైద్యులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు మరియు బాలింతలు పాల్గొన్నారు.