‘టీజీ20’ లీగ్‌కు స్పాన్సర్ క్రెడాయ్
యువ క్రీడాకారులకు ప్రోత్సాహం
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్, తొలి టీజీ20 క్రికెట్‌లీగ్‌కు ప్లాటినం స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్నట్లు వెల్లడించింది. క్రెడాయ్ హైదరాబాద్ తెలంగాణ లో క్రికెట్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడంతో పాటుగా యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను సైతం అందిస్తోంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు, క్రెడాయ్ హైదరాబాద్ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది.
౮ నగర ఫ్రాంచైజీలు, 32 మ్యాచ్‌లతో పాటు జిల్లాస్థాయి ప్రతిభను చేర్చాలనే బలమైన లక్ష్యంతో సాగుతు న్న టీజీ20 లీగ్, తెలంగాణలో ఒక పటిష్టమైన క్రికెట్ పర్యావరణ వ్య వస్థను సృష్టించే దిశగా వేసిన ఒక సాహసోపేతమైన, అర్థవంతమైన ముందడుగు. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎన్.జైదీప్‌రెడ్డి ‘సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యా చ్’ అవార్డును ప్రదానం చేసే గౌరవాన్ని అందుకున్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా, క్రెడాయ్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ సూ పర్ స్ట్రైకర్‌కు, టోర్నమెంట్ సూపర్ స్ట్రైకర్‌కు పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఎన్ జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశంలోని ప్రసిద్ధ క్రీడా వేదికలలో ప్రాంతీయ క్రీడా ప్రతిభకు మద్దతు ఇవ్వడానికి, యువ ప్రేక్షకులతో తన సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి క్రెడాయ్ హైదరాబాద్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు.






