13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

దగర్ సోదరులకు క్రెడిట్స్ ఇస్తా!

21-02-2026 01:48 AM

‘పొన్నియిన్ సెల్వన్-2’ చిత్రంలోని ‘వీర రాజా వీర’ పాటను దగర్ కుటుంబానికి చెందిన ‘శివస్తుతి’ నుంచి స్ఫూర్తి పొంది స్వరపరిచినట్లు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఒప్పుకున్నారు.  శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా, రెహమాన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. దివంగత ఉస్తాద్ ఎన్ ఫయాజుద్దీన్ దగర్, ఉస్తాద్ ఎన్ జహీరొద్దీన్ దగర్ ప్రదర్శనను గుర్తిస్తూ పాటకు క్రెడిట్ ఇచ్చేందుకు రెహమాన్ అంగీకరించారని తెలిపారు.

అయితే, ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న ప్రధాన సివిల్ దావాలో తమ హక్కులకు ఎలాంటి భంగం కలగని రీతిలో ఈ తాత్కాలిక ఏర్పాటుకు ఒప్పుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఐదు వారాల్లోగా అన్ని సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో పాట క్రెడిట్స్‌లో ఈ మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ తాత్కాలిక ఒప్పందం వల్ల హైకోర్టులోని సివిల్ సూట్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆ కేసు మెరిట్స్ ఆధారంగానే విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.