13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

కొత్త సినిమాకు శ్రీకారం

21-02-2026 01:50 AM

‘మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయమైన మంజునాథ్. ఇప్పుడు ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మంజునాథ్ కథానాయకుడిగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై వీ లక్ష్మీదేవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నూతన దర్శకుడు అభిరామ్ గంటా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.  ఈ సందర్భంగా హీరో మంజునాథ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను ప్యాషన్ డిజైనర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నా. అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది” అన్నారు.

‘ఈ సినిమాలో లవ్, కామెడీ, సస్పెన్స్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయ’ని దర్శకుడు అభిరామ్ చెప్పారు. నిర్మాత లక్ష్మీదేవి మాట్లాడుతూ.. “చిత్రంలో హీరో మంజునాథ్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించనుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని తెలిపారు.