calender_icon.png 13 October, 2025 | 11:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో మానసిక దృఢత్వం

13-10-2025 08:44:55 AM

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ 

ఎన్ ఎన్ జి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు 

అమీన్ పూర్:  యువతకు  క్రీడలు ఎంతో అవసరమని క్రీడలపై ఆసక్తి కనబరచాలని  చదువుతోపాటు  క్రీడలు ఎంతో ముఖ్య మని  అమీన్ పూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ తెలిపారు. ఎన్ ఎన్ జి యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఆదివారం  అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీ,  కృష్ణదేవ రాయ నగర్ కాలనీ,  సృజన లక్ష్మీ నగర్ కాలనీ, తోపాటు పలు కాలనీల యువకుల కోరిక మేరకు హైదరాబాద్ శివారులోని   చిలుకూరు ప్రాంతంలో  క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన  క్రీడలను నరసింహ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమీన్ పూర్ కాలనీ వాసుల కోరిక మేరకు  క్రీడలను ఏర్పాటు చేసి వాటిని నా చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమని ఇంకా మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ  యువతకు అందిస్తానని  కావున ప్రధానంగా విద్యార్థిని, విద్యార్థులు చదువుతోపాటు మంచి క్రమశిక్షణ క్రీడారంగంపై  దృష్టి సారించాలని  ఆయన ఆకాంక్షించారు. అప్పుడే మీ తల్లిదండ్రులకు  మీకు చదువు చెప్పిన గురువులకు ఈ యొక్క ప్రాంతానికి  మంచి పేరు వస్తుందని ఆ దిశగా యువత ముందుకు ప్రయాణించాలని ఆయన కోరారు. క్రీడల్లో యువత గెలుపు ఓటములు  సహజమని ఆ ఆలోచన లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆయన కోరారు. ఈ  కార్యక్రమంలో వివిధ కాలనీల వాసులు, క్రీడాకారులు, యువకులు, ఎన్ ఎన్ జి యువసేన నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.