18-01-2026 07:27:48 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): నగరంలోని రేకుర్తి 19వ డివిజన్లో సుధగోని నర్సయ్య స్మారకర్థం ఈద్గా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 18వ డివిజన్ మాజీ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణగౌడ్ మ్యాచ్ లో విజేతలుగా నిలిచిన సాలెహు నగర్ సీనియర్స్, శేఖబి కాలనీ లయన్స్ క్రికెట్ కప్ లను అందజేసి నగదు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత క్రీడాల్లో రాణిస్తూ మానసికంగా దృడంగా ఉంటూ ఉన్నతంగా ఉపాధిలు సాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మజీద్, ఫిరోజ్, అజయ్, పర్శరాం, నందు, రమేష్, శ్రీనివాస్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.