18-01-2026 07:29:58 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలో మండల కేంద్రంలోని కటికెం మల్లేశుని జాతరలో ఆదివారం వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీం, కామారెడ్డి జిజిహెచ్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఆర్జీ కే ర్ లింక్ వర్కర్ స్కీమ్ డీ ఆర్ పీ సుధాకర్, కామారెడ్డి ఐ సి టి సి కౌన్సిలర్ నాగరాజు సుఖ వ్యాధులు, హెచ్ఐవి, టీబీ వ్యాధులపై అవగాహన కల్పించారు. శిబిరంలో భాగంగా 238 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో లింకు వర్కర్ స్కీమ్ సూపర్వైజర్ జ్యోతి, లింకు వర్కర్లు బాలకిషన్, లావణ్య, హరిప్రియ, లక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ కొండ ఆంజనేయులు, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.