08-01-2026 05:56:59 PM
ముఖ్య అతిథులుగా తుంగతుర్తి రవి
మేడిపల్లి,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్–9వ డివిజన్ మేడిపల్లి లోని పర్వతాపూర్ ప్రాంతంలో ఈరోజు శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ... ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా, పోషకాహారంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
చిన్న వయస్సులోనే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కలిగితే భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని అన్నారు.విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ఆహార పదార్థాలు, వారి ఆలోచనా విధానం ప్రశంసనీయమని అన్నారు.ఇటువంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.