వివాదంలో యాంకర్ విష్ణుప్రియ.. క్రిమినల్ కేసు నమోదు
విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఎఐఎస్ఎఫ్(All India Students Federation) నాయకులు ఫిర్యాదు చేయడంతో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అర్ధనగ్న వీడియో చూడాలంటే నగదు చెల్లించి సజ్ స్క్రైబ్ చేసుకోవాలంటూ, యువతను తప్పుదోవ పట్టించే అడల్ట్ కంటెంట్ ఉందని వారు ఆరోపించారు. పలు టీవీ షోల్లో అందరినీ నవ్వుంచే యాంకర్ విష్ణుప్రియ డబ్బులకు ఆశపడి అర్థనగ్న వీడియాలు చేస్తున్నారని, ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సింది పోయి. ఇలాంటి ప్రకటనలు చేస్తూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. వేంటనే విష్ణుప్రియకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని, అంతేకాకుండా ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఏవైనా చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించడానికి డిజిటల్ సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని పరిశీలించడం ప్రారంభించినట్లు సమాచారం.




