బైక్ సైలెన్సర్లు మార్చితే క్రిమినల్ కేసులు
23-05-2024 07:10 AM
హనుమకొండ, మే 22 (విజయక్రాంతి): బైక్ సైలెన్సర్లకు ఎలాంటి మార్పు చేసినా ఓనర్‌తోపాటు మెకానిక్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. నింబధనలు అతిక్రమించిన 261 బైక్ సైలెన్సర్లను సీజ్ చేసి బుధవారం హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయం ఎదుట రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.






