కంటికి రెప్పలా చూసుకుంటాం
కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల చెక్కు అందజేత
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట రూరల్, మే 22(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలందరిని కంటికి రెప్పలా చూసుకుంటామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రమైన నంగునూరుకు చెందిన సుంచనకోట యాదగిరి అనే కార్యకర్త ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు. బుధవారం మృతుడి భార్య మాధవికి రూ. 2లక్షల పార్టీ బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తకు ప్రమాదబీమా వర్తిస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలో 48మందికి రూ. 2లక్షల చొప్పున రూ. 98 లక్షలు మంజూరి అయినట్టు తెలిపారు. కార్యక్రమంలో నంగునూరు మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.






