ఆదిలాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం
నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఆదిలాబాద్/కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రహదారిపై భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో పలుచోట్ల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పలు గ్రామా ల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. జన్నా రం ఉట్నూర్ అటవీ ప్రాంతంలోని ఉడుంపూర్, రాంపూర్ గ్రామాల మధ్యలోని రహదారిపై వృక్షాలు కూలడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాంసి, బోథ్ మార్కెట్ యార్డ్‌లో జొన్నలు తడవంతో అన్నదాతలు లబోదిబోమంటున్నా రు. తాంసిలో కుంటాల రమేశ్ ఇంటిపై చెట్టు కూలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లాలోని మహమ్మద్ నగర్ మండంలో గాలివాన బీభత్సానికి ఇండ్ల పైకప్పులు ధ్వంసం అయ్యాయి.






