కార్మికులతో పాటు పారిశుధ్య పనులు చేసిన సర్పంచ్ భర్త
19-03-2026 01:48 AM
అయిజ మార్చి 18: అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలోని సర్పంచ్ మహేశ్వరమ్మ భర్త సుధాకర్ గౌడ్ తను పారిశుద్ధ్య పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఎదుటివారికి పనులు చేయమని ఆజ్ఞపించడమే కాదు, సోదరా భావంతో మనము కార్మికులతో కలిసి పనులు చేయాలని, అప్పు డే ఊరిని శుభ్రంగా ఉంచుకోవాలనే తపన, జిజ్ఞాస కార్మికులకు కలుగుతుందని, మా గ్రామాన్ని పలు గ్రామాలకు ఆదర్శ గ్రామంగా నిలుపాలనే మా ల క్ష్యం అన్నారు.
తన భార్యకు సర్పంచ్ పదవి రాకముందే కూడా అయిజ నుం డి చిన్న తాండ్రపాడు వరకు చిన్నచిన్న రోడ్లు మరమ్మతులు చేయడమే గాక గ్రామంలో గతంలో కూడా డ్రైనేజీ పనులు చేశారని ఊరి కోసం ప్రజల భాగు కోసం ఎంతైనా తపన పడతాడని గ్రామస్తులు ప్రశంసించారు.




