01-09-2025 12:37:28 AM
-నకిలీ ఘడీ డిటర్జెంట్ పౌడర్ స్వాధీనం..
ఆదిలాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మార్కెట్‌లో రోజురోజుకు డూప్లికేట్ వస్తువుల విక్రయాలు జోరందుకుం టున్నాయి. ఎక్కడ చూసిన తిను బండరాల నుండి మొదలుకొని అన్ని వస్తువులు నకిలీవే చలామణి అవుతున్నాయి. ప్రముఖ కంపెనీలు పోలిన నకిలీ వస్తువుల దందా యథే చ్ఛగా సాగుతోంది.
తాజాగా ఘడీ డిటర్జెంట్ పౌడర్ మాదిరిగానే నకిలీ డిటర్జెంట్ పౌడర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపే ష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుండి నకిలీ ఘడి డిటర్జెంట్ ను తీసుకువచ్చి ఆదిలాబాద్, మహారాష్ట్రలోని జివితి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్మే క్రమంలో టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారన్నారు.
స్థానిక స్వస్తిక్ జిన్నింగ్ మిల్ లో బొలెరో వాహనంలో తరలిస్తున్న 60 బ్యాగులలో దాదాపు 15 క్వింటల్లా నకిలీ డిటర్జెంట్ ఒక కిలో ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఘడీ డిటర్జెంట్ పౌడర్ డిస్ట్రిబ్యూటర్ ప్రేమ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురి పై కేసు నమోదు చేశమన్నారు.
అందులో శివాజీ ఎన్ జవాలే, రామ్ రావు వన్కంటి, రూపేష్ అగర్వాల్ లను అరెస్టు చేయాగ, అప్సక్ సలత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్త్స్ర విష్ణు ప్రకాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.