క్రాంప్టన్‌గ్రీవ్స్ లాభం రూ.161 కోట్లు
18-05-2024 12:21 AM
న్యూఢిల్లీ, మే 17: కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కంపెనీ క్రాంప్టన్ గ్రీవ్స్ 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 161 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో నమోదుచేసిన నికరలాభంతో పోలిస్తే 22 శాతం వృద్ధి సాధించింది. రికార్డుస్థాయిలో రూ.1,797 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తాము 2 కోట్ల ఫ్యాన్ల ను విక్రయించి రికార్డు సృష్టించినట్టు క్రాంప్టన్ గ్రీవ్స్ తెలిపింది.






