3 May, 2026 | 6:11 PM

వేలాడుతున్న విద్యుత్ తీగలతో పంట పొలాలకు ప్రమాదం

03-05-2026 04:52 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు వేలాడడంతో రాపిడికి గురై మంటలు చెలరేవుతున్నాయని రైతులు వాపోతున్నారు. చేతికి వచ్చిన పంట విద్యుత్ తీగల వల్ల షాక్ సర్క్యూట్ తో పంటలను నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మండల. కేంద్రం సమీపంలోని తూము జనార్ధన్ అనే రైతుకు చెందిన జనార్ధన్ అనే రైతుకు చెందిన పంట పొలంలో విద్యుత్ తీగలు క్రిందికి వేలాడడంతో రాపిడికి గురై అగ్నిప్రమాదం సంబంధించింది.విద్యుత్ తీగల ను సరిచేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో అగ్ని ప్రమాదం సంబంధించిందని బాధిత రైతు వాపోయారు.