10 May, 2026 | 1:15 AM

పంటల మార్పిడి అత్యవసరం

10-05-2026 12:00 AM
  1. మొత్తం వరి సాగులో ఉద్యాన పంటలను 13 లక్షల ఎకరాలకు మళ్లించాలి
  2. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి) :  రైతుల ఆదాయం పెంపు, భవిష్యత్ ఆహార భద్రత కోసం పంటల మార్పిడి అత్యవసరమని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సజన్‌లలో కలిపి సుమారు 1.30 కోట్ల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని, వచ్చే మూడేళ్లలో అందులో కనీసం 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆయిల్ సీడ్స్ వైపు మళ్లించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

రాష్ట్రంలో పంటల మార్పిడి అవశ్యకత పై వ్యవసాయశాఖ కమిషన్ రూపొందించిన నివేదికను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు శనివారం సచివాలయంలో రైతు కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డి, సభ్యులు అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్పిడిలో భాగంగా మార్కెట్‌లో డిమాండ్ ఉండే పం టలు సాగు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుందన్నారు.

ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్‌పామ్ సాగైందని, వచ్చే సం వత్సరం లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక తయారుచేసి, లక్ష్యాన్ని సాధించాలని  సూచించా రు. కేంద్రం రూపొందించిన విత్తనచట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. నకిలీ విత్తన నియంత్రణలో రాష్ట్రాలకు కూడా సముచిత అధికారాలు కల్పించాలని కేంద్రా న్ని మంత్రి  డిమాండ్ చేశారు. 

ఖరీఫ్‌కు యూరియా సిద్ధంగా ఉంచండి

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అవసరం మేరకు యూరియా సిద్ధంగా ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.రాష్ట్రానికి యూరియా కేటాయింపులకు అనుగుణంగా సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పు డు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రామగుండం ఎరువుల కర్మాగా రంలో ఉత్పత్తి అయ్యే యూరియాలో తెలంగాణ రాష్ట్రానికి 90 శాతం కేటాయించాలని కేంద్రాన్ని మంత్రి కోరారు.  సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, వ్యవసా యశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మీన్‌బాషా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.