ప్రారంభానికి ముందే కూలిన 12 కోట్ల వంతెన
19-06-2024 12:00 AM
బీహార్‌లో ఘటన
పాట్నా, జూన్ 18: బీహార్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన కుప్పకూలింది. బక్రా నదిపై అరారియా ప్రాంతంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన భారీ వరదకు తట్టుకోలేక క్షణాల్లో నదిలో కూలిపోయింది. అరారియా జిల్లాలోని కుర్సకాంత, సిక్రి ప్రాంతాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నది ఉదృతికి వంతెలోని ఓ పిల్లర్ పక్కకు ఒరిగిపోయింది. దీంతో దానిపై ఉన్న వంతెన భాగం నదిలో కూలిపోయిన వరద నీటిలో కొట్టుకుపోయింది.నిర్మాణంలో నాణ్యత లేకపోవటం వల్లనే వంతెన కూలిపోయిందని సిక్రి ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.






