నేతన్నలకు 500 కోట్లు కేటాయించాలి
- టెండర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
- త్వరలో వరంగల్, కరీంనగర్‌లో భారీ చేనేత మహాసభకు ఏర్పాటు చేస్తాం
- టెస్కోను ఉరితీయాలన్న టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలి
- రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఆర్థికంగా, సామాజికంగా, రాజకీ యంగా అన్ని రంగాల్లో వెనుకబడిన చేనేత రంగాల అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే రూ. 500 కోట్లను కేటాయించాలని, పలువురు వక్తలు పేర్కొన్నారు.
టెస్కోను ఉరితీయాలన్న టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేనేత వర్గాల చైతన్య వేదిక, బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో చేనేతకు టెండర్ గండం- ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం, ఉద్యమ కార్య చరణపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిక్కా దేవదాసు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు చెరుపల్లి సీతారాములు, బీసీ మేధావుల ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులు, ఆప్కో మాజీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీ య ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేనేత, బీసీ సం ఘాల నాయకులు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. అనిల్ కుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు కృషి చేస్తానన్నారు. బీసీ మేధావుల ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ చేనేత రంగానికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపు తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుండి 7లక్షల 38 వేల కోట్లు ఖర్చు చేసిందని, కానీ చేనేత రంగానికి నాలుగు కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. గత 13 ఏళ్ల నుండి పాలక వర్గాలు సొసైటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అభివృద్ధి కుంటు పడిందన్నారు.
ఈ రౌండ్ టేబుల్ మావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిక్కా దేవదాస్, చేనేత కార్మిక సంఘాల నేతలు, వనం శాంతి కుమార్, బిక్షపతి, లక్ష్మీ నరసయ్య, మనోహర్, వీర మో హన్, గండి మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




