10 April, 2026 | 3:03 AM

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

10-04-2026 01:06 AM

ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి

కుషాయిగూడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ మదర్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని కాప్రా సర్కిల్ పరిధిలోని రాధిక చౌరస్తాలో గల పరివార్ హోటల్లో క్లబ్ అధ్యక్షులు లయ న్ వడ్లోజు జ్యోతిర్మయ చారి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయనతోపాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాప్రా సర్కిల్ డిప్యూ టీ కమిషనర్ శ్రీహరి, ఉప్పల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీలో అధ్యక్షులు వడ్లోజు జ్యోతిర్మయాచారి, ప్రధాన కార్యద ర్శి ఆదిమూల శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు లక్కడి బాల్రెడ్డి కార్యనిర్వాక కార్యదర్శి గడ్డమీద బాలరాజు గౌడ్, కార్యదర్శిగుమ్మడి రోజా రాణి ప్రమా ణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, కుషాయిగూడ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, వెంకన్న, శ్రీనివాస్, సతీష్ విజయ్, చర్లపల్లి ఐలా చైర్మన్ గోవింద్ రెడ్డి, టిఫ్ చైర్మన్ సుధీర్ రెడ్డి, చర్లపల్లి ఐల మాజీ చైర్మన్ రోషి రెడ్డి జలంధర్ రెడ్డి, గోపాలరావు, తాటి శ్రీనివాస్ వెంకటేశ్వర్ రెడ్డి, లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇన్నారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గవర్నర్ కళ్యాణ్ కృష్ణారెడ్డి డిస్టిక్ వైస్ డిస్టిక్ మొదటి గవర్నర్ డాక్టర్ మండా సురేష్, డిస్టిక్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ శేఖర్ రెడ్డి,

కాప్రెసరికి లీప్టి కమిషనర్ శ్రీహరి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, బిజెపి అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, సీపీఐ జాతీయ నాయకులు వీఎస్‌బోస్, సీపీఎం నాయకులు యా దగిరిరావు కోమటి రవి, బిజెపి రాష్ట్ర నాయకులు ఏనుగు రాజిరెడ్డి, నాయకులు సింగి రెడ్డి సోమశేఖర్ రెడ్డి, కనుకుల రజినీకాంత్‌రెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, రాంప్రదీప్ మునుగం టి, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, సింగిరెడ్డి ధనపాల్‌రెడ్డి, స్వర్ణరాజ్ శివమణి, బొంతు శ్రీదేవి, గుండారపు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.