10 April, 2026 | 3:01 AM

కేఎంసీలో ర్యాగింగ్ కలకలం!

10-04-2026 01:09 AM

బాధ్యులైన విద్యార్థులు మూడు నెలలు సస్పెన్షన్

వరంగల్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో మరోసారి ర్యాగింగ్ కలకలం సృష్టిం చింది. ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అభ్యంతరకరమైన విధంగా వాట్సాప్ గ్రూపుల్లో సం దేశాలు పెడుతున్నారని, ఈ అంశంపై మాట్లాడుదామని పిలిచి ర్యాగింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

తమను సీనియర్లు మోకాళ్లపై కూర్చోబెట్టి ర్యాగింగ్ చేశారంటూ జూనియర్ విద్యార్థులు కళాశాల యాంటీ ర్యా గింగ్ కమిటీకి ఫిర్యాదు చేయడం తో స్పందించిన కళాశాల అధికారులు విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన విద్యార్థులను మూడు నెలలపాటు సస్పెండ్ చేసినట్టు ప్రచా రం సాగుతుండగా, అధికారికంగా ప్రకటన రావా ల్సి ఉంది.

కేయూలో ఆరుగురు విద్యార్థుల సస్పెండ్ ఇక కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మె స్సీ కెమిస్ట్రీ ద్వితీయ సంవత్స రం చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై వర్సిటీ అధికారులు స్పందించారు. శ్రీవిద్యపై సహచర వి ద్యార్థులు దొంగతనం ఆరోపణలు చేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకు న్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై నియమించిన కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఆరుగురు విద్యార్థులపై సెమిస్టర్‌పాటు సస్పెన్షన్ విధించినట్టు అధికారులు పేర్కొన్నారు.