5 March, 2026 | 7:16 AM

ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 707 కోట్లు విడుదల

30-11-2025 01:39 AM

 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు..

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీమేరకు పెండింగ్ బిల్లులకు సంబంధించిన రూ. 707.30 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీచేశారు. ఇందులో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్, అడ్వాన్స్‌లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు నవంబర్ నెలకు సంబంధించిన రూ. 707.30 కోట్ల పెండింగ్ బిల్లులను శనివారం విడుదల చేశారు.

ఉద్యోగ సంఘా లకు ఇచ్చిన హామీలో భా గంగా ప్రతినెలా రూ.700 కో ట్లకుపైగా నిధులను విడుదల చేస్తూ వస్తున్నారు.  వరుసగా నాలుగు నెలలుగా ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల బకాయిలను నవంబర్‌తో చెల్లిస్తూ వస్తోంది.