కడ్తాల్ మండలానికి ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ.1.30 కోట్ల నిధులు మంజూరు
కడ్తాల్: కడ్తాల్ మండలానికి ఎస్సి సబ్ ప్లాన్ ద్వారా రూ. 1.30కోట్లు మంజూరైనట్లు డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండ ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు బీఛ్యా నాయక్, నాయకులతో కలిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు.
కడ్తాల్ మండలానికి వివిధ గ్రామాలకు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహాకారంతో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం 28 పనులకు సిఆర్‌ఆర్ ఫండ్ ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.
అన్మస్ పల్లి రూ. 3లక్షలు, చల్లంపల్లి రూ. 7లక్షలు, చరికొండ రూ. 10లక్షలు, ఏక్వాయిపల్లి రూ. 10లక్షలు, కర్కల్ పహాడ్ రూ. 4లక్షలు, మక్తమాధారం రూ. 10లక్షలు, మర్రి పల్లి రూ. 8లక్షలు, ముద్విన్ రూ. 15లక్షలు, రావిచెడ్ రూ. 15లక్షలు, సాలార్ పూర్ రూ. 10లక్షలు, వాసుదేవ్ పూర్ రూ. 8లక్షలు, గోవిందాయపల్లి రూ. 10లక్షలు మంజూరైనట్లు వారు తెలిపారు.




