calender_icon.png 16 February, 2026 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు

16-02-2026 10:03:40 AM

మహా శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో భక్తుల కిటకిట.

హనుమకొండ,(విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి. హనుమకొండలోని చారిత్రక వేయి స్తంబాల గుడిలోని రుద్రేశ్వరుడి దర్శనానికి భక్తులు ఉదయం 3 గంటల నుండి భారీగా తరలి వచ్చారు. ఆదివారం ఉదయం 3:30 గంటలకు సుప్రభాత సేవ మంగళ వాయిద్య సేవ నిర్వర్తించి రుద్రేశ్వరునికి పాశుపత రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గంటల వరకు జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు ముత్యాల తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ వ్రతం నిర్వర్తించారు.

ఈ శివపార్వతుల కళ్యాణానికి దాతలుగా వద్దిరాజు వెంకటేశ్వర్ల దంపతులు, మాడిశెట్టి సాంబయ్య దంపతులు వరుడు తరపున వెంకటేశ్వరరావు, వధువు పక్షాన మాడిశెట్టి సాంబయ్య దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించారు. ఉదయం రుద్రేశ్వర స్వామి రుద్రాభిషేకంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ దంపతులు, అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి, కూతురు గోదాదేవి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, ప్రముఖ బిల్డర్ సీతారామరెడ్డి,వే ముల సత్యమూర్తి,రామ్ రెడ్డి, ఏసీపీ నరసింహారావు,హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, ఉత్సవ అధికారి రామల సునీత, జిల్లా న్యాయమూర్తులు, వాగ్దేవి కళాశాల చైర్మన్ చందుపట్ల దేవేందర్ రెడ్డి ,హైకోర్టు జస్టిస్ సాంబశివ నాయుడు, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ సీపీ  సన్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనా చారి, బీజేపీ హన్మకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సతీమణి రేవతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మండువ శేషగిరిరావు, స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, ప్రముఖ సినీ గేయ రచయిత వరంగల్ వాసి కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వర్తించారు.

ఉదయం నుంచి వేలాది మంది భక్తులు  స్వామివారిని దర్శించుకున్నారు. శివ కళ్యాణం లో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గారపల్లి మహేశ్వర శర్మ శివతత్వంపై ఉద్బోధించారు. ఆలయ ఈఓ డి అనిల్ కుమార్  ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ వైదిక పండితులు వైదిక కార్యక్రమాలను నిర్వర్తించారు. రుద్రేశ్వర సేవా సమితి సభ్యులు చొల్లేటి కృష్ణమాచారి గండ్రాతి రాజు, కట్ల రాజు, సురేష్ కుమార్, శివలింగా చారి. నవీన్ కుమార్ చారి భక్తులకు సేవలందించారు .కె యు.ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భక్తులకు మంచినీరు అందించారు. సుధీర్ రావు, తాడూరి రేణుకా బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శనలు బోడిగ లక్ష్మీనారాయణ చే శివపార్వతుల కళ్యాణ హరికథా కాలక్షేపం నిర్వహించారు. వరంగల్ లోని చారిత్రక శ్రీ భద్రకాళీ క్షేత్రంలోని శ్రీ భద్రేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన మహాశివరాత్రి పూజల్లో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల దర్శనానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. 

వేయి స్తంభాల గుడిలో సీపీ ప్రత్యేక పూజలు

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మహాశివరాత్రి పురస్కరించుకుని హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయన, రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీపీ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పవిత్ర శివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

శివాలయాల్లో మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు..

మహా శివరాత్రి సందర్భంగా వరంగల్ లోని చారిత్రక  శివాలయాల్లో రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖిలా వరంగల్ లోని శ్రీ స్వయభు శభూలింగేశ్వరా స్వామి దేవాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర 

నాయకులు గోపాల నవీన్ రాజ్, స్థానిక కార్పొరేటర్లు బోగి సువర్ణ సురేష్, భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీసాల ప్రకాష్, బోయిని దూడయ్య, సంగరబోయిన చందర్, ఆలయ కమిటీ కార్యవర్గ చైర్మన్ బంగారి శ్రీనివాస్, ధర్మకర్తలు శివ, గిరి, శ్రీలత లతో పాటు ఈఓ వెంకటేశ్వర్లు, అర్చకులు శంభూలింగం, లత, రాజు, ప్రతాప్,చుక్క రాజు,రాజమల్లు,ప్రవీణ్,అభినవ్, శ్రీధర్, బోలెషా, రాజేష్,లతో పాటు ఆలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  34 డివిజన్ శివనగర్ రామాలయం లోని శ్రీ రామలింగేశ్వరా స్వామికి మంత్రి కొండా సురేఖ ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో రామాలయం ట్రస్ట్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.