13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు

16-02-2026 10:05 AM

ఐదు నదుల జలాలతో రుద్రాభిషేకం

వేదమంత్రోత్సవాల మధ్య శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని కీతవారిగూడెం,పోనుగోడు లో త్రిలింగేశ్వర స్వామి దేవాలయం పలు గ్రామాలలో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.కీతవారిగూడెంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి శివాలయంలో చుట్టూ పలు గ్రామాల నుండి భక్తులు ఆ పరమశివుని దర్శించుకునేందుకు తెల్లవారుజామునుండే ఆలయానికి తరలివచ్చారు.స్వామివారికి ఐదు నదుల జలాల జలాభిషేకం, రుద్రాభిషేకం సహస్రనామాలు కుంకుమార్చనలు పలు హోమాలు నిర్వహించారు.స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ గేట్లను ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి,చైర్మన్ శ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ మాట్లాడుతూ శివాలయం నిర్మించి 17వ వార్షికోత్సవం శివరాత్రి రోజున రావడం చాలా శుభదాయకంగా ఉందని,ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి మాలధారన ధరించి ఉపవాసాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నారు.20వేల మంది భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.రాత్రికి స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు