calender_icon.png 18 December, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం!

18-12-2025 09:37:26 AM

హైదరాబాద్: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు మొత్తం 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తగిన ఏర్పాట్లతో, ఓపికతో స్వామివారి దర్శనానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

నిన్న ఒక్కరోజే 66,389 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఇక, శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని, 24,956 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా నిన్న ఒక్కరోజు రూ.3.81 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.